తెలుగు NRI ప్రత్యేక హోదా పోరాట సమితినిరసన జ్వాలలతో భగ్గుమన్న డల్లాస్ మహానాడు

మొట్ట మొదటి సారిగా డల్లాస్ నగరం లో జరుగుతున్న తెలుగుదేశం మహానాడుకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది , మహానాడు ఎందుకు ఇక్కడ పెట్టామో అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇండియా నుండి వచ్చిన నాయకులు వాపోయారు , ఇక్కడ టీడీపీ మీద ఇంత వ్యతిరేకత ఉందా అని ఊహించలేకపోయాము , ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చాము ఎంతో మంది వస్తారని ఆశిస్తే , తీరా లోపల ఉన్న కార్యకర్తలు కంటే బయట నిరసన తెలిపిన వ్యక్తులు ఎక్కువ ఉన్నారని అన్నారు. ఇది పూర్తిగా మహానాడు నిర్వాహకుల వైఫల్యం అని అన్నారు

అమెరికా నలుమూలల నుండి వందకి పైగా తెలుగు NRI లు డల్లాస్ లో జరుగుతున్నటువంటి మొదటి మహానాడు వద్ద నిరసన తెలపడానికి వచ్చారు . అందరూ నల్లటి దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేసారు, వచ్చిన ప్రతివారు తెలుగు దేశం ప్రభుత్వం వైఫల్యాలను సవివరంగా ఆధారాలతో సహా ఎండగట్టారు , ముఖ్యంగా ప్రత్యేక హోదా సాధించడం లో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని ప్రతి ఒక్కరు అభిప్రాయపడ్డారు , ప్లకార్డు లు మరియు బ్యానర్ లతో విన్నూత్నంగా నిరసన వ్యక్తం చేసారు

కుల , మత , రాజకీయ, ప్రాంత భేధాలు లేకుండా అందరూ కలిసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు . ఇదంతా గమనించిన ఇండియా నుండి వచ్చిన నాయకులు డల్లాస్ మహానాడు నిర్వాహుకులని మందలించడం గమనార్హం . రెండో రోజు మహానాడు జారుగుతుందో లేదో అని అనుమానాలు వ్యక్తం చేసారు , ఇవి అన్ని చూసి చాలా మంది సభాప్రాంగణం విడిచి వెళ్లడం గమనించాలన్సిన అంశం . అసలే కార్యకర్తలు లేక వెలవెల పోతున్న డల్లాస్ మహానాడు పూర్తిగా కుదేలైంది . నిరసనకారులు అందరూ ప్రత్యేకహోదా మీద చిత్త శుద్దితో వ్యవహరించాలని టిడిపి ప్రభుత్వానికి హితవు పలికారు

Please watch eBox TV Telugu on world’s largest http://www.YuppTV.Com or at http://www.myebox.tv

SUBSCRIBE to our email list https://www.myebox.tv/subscribe

eBox TV is America’s # 1 Local Telugu Channel. ☛ Subscribe to us for Local Programs, Game Shows, Music Lessons, Dance Lessons, Immigration Shows, Real Estate Shows, Reality Shows, Latest Movie Trailers, Local News, Gossip

☛ http://www.myebox.tv
☛ http://youtube.com/eboxtv
☛ Follow Us on https://twitter.com/myeboxtv
☛ Like Us on https://www.facebook.com/myeboxtv
☛ Follow Us on https://plus.google.com/+eBoxTVTelugu

Add comment

Your email address will not be published. Required fields are marked *